కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయంలో శనివారం విదేశీ ప్రతినిధులు సందడి చేశారు. హైదరాబాద్‌లోని ఎం.సి.హెచ్.ఆర్.డి లో ప్రొఫెసర్, కోర్స్ డైరెక్టర్ డాక్టర్ రావులపాటి మాధవి ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న టాంజానియా దేశానికి చెందిన 30 మంది మిడ్ లెవెల్ సివిల్ సర్వెంట్ అధికారులు రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. అధికారులకు ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ లు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. టూరిజం శాఖ గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ దేవాలయ నిర్మాణ శైలి, కాకతీయుల శిల్పకళా మాధుర్యం, యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన చరిత్రను వివరిస్తూ ప్రతినిధులకు అవగాహన కల్పించారు. వారు రామప్ప చెరువులో బోటింగ్ చేశారు.


