కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ – పాపట్‌పల్లి మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈనెల 14 నుంచి 18 వరకు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే శాతవాహన, ఇంటర్‌సిటీ, కాజిపేట – డోర్నకల్ పుష్‌పుల్ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. గోల్కొండ ఎక్స్‌ప్రెస్ కాజీపేట-సికింద్రాబాద్ వరకే పాక్షికంగా నడుస్తుందని తెలిపారు. అదేవిధంగా కోణార్క్, షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లు దారి మళ్లించి నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా రైళ్లలో ప్రయాణించే వారు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.


