కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని చిన్న నాగారం గ్రామంలో జగజ్జనని లోకపావని దుర్గ మాతను తొమ్మిది రోజులు నరసింహ చారి మంత్రోచ్ఛరణలతో నిష్టతో పూజలు చేసి గ్రామంలో ఊరేగింపు గా చేసి గ్రామ చెరువులోని గంగమ్మ ఒడికి దుర్గామాత ను చేర్చారు. శనివారం ఊరేగింపులు మంగళ వాయిద్యాలతో డప్పు చప్పులతో మహిళలు కోలాటాలతో తరలిస్తున్న సందర్భంలో గ్రామస్తులు అమ్మవారికి నీళ్లు ఆరబోసి మంగళహారతులు టెంకాయలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాగమణి, సుమలత, రమాదేవి, నీరజ, మంజుల, కలమ్మ, రాణి, హైమా తదితరులు పాల్గొన్నారు.


