కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడిన ఇద్దరు యువకుల్లో ఒకరు, వైద్యుడిపై అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేసిన కేసు బయటపడింది.
మాదాపూర్ పరిధిలో పనిచేస్తున్న ఒక వైద్యుడు, డేటింగ్ యాప్‌లో ఒక యువకుడితో స్నేహం పెంచుకున్నాడు. వారిద్దరూ చాటింగ్ చేస్తూ, ఇటీవల కలుద్దామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఒక ఓయో రూమ్ బుక్ చేసుకుని కలుసుకున్నారు.అయితే రూములోకి వెళ్లిన తరువాత, ఆ యువకుడు వైద్యుడిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. కానీ వైద్యుడు నిరాకరించడంతో, ఆగ్రహించిన యువకుడు అతడిపై దాడికి దిగాడు. అంతేకాదు, “డబ్బులు ఇవ్వకపోతే మనం రహస్యంగా కలిసిన విషయం బయటపెడతాను” అంటూ బెదిరించాడు.
భయంతో వైద్యుడు కొంత మొత్తం ఇచ్చినా, ఆ తర్వాత కూడా ఆ నిందితుడు అతను పనిచేస్తున్న ఆసుపత్రి వరకు వెళ్లి గొడవ సృష్టించాడు. దీంతో విసిగిపోయిన వైద్యుడు పోలీసులను ఆశ్రయించాడు.ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో మాదాపూర్ ప్రాంతంలో కలకలం రేగింది.


