కాకతీయ, పెద్దపల్లి : పెద్దపల్లి ట్రినిటీ ప్రైమరీ స్కూల్లో జరిగిన సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు విశిష్ట స్పందన లభించింది. ఈ పోటీలలో బాలురు 177 మంది, బాలికలు 191 మంది పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ డి. ప్రశాంత్ రెడ్డి హాజరై, క్రీడాకారులు మంచి ఆటతీరు కనబరిచి జిల్లాకు పేరు తీసుకురావాలని సూచించారు.
డైరెక్టర్ మమతా రెడ్డి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ కరుణాకర్ మాట్లాడుతూ సబ్ జూనియర్ కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలు ఈ నెల 25 నుంచి 28 వరకు నిజామాబాద్ లో జరగనున్నాయని తెలిపారు. కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ధర్మయ్య, శంకరన్న, కృష్ణయ్య, వేల్పుల సురేందర్, డి. రమేష్, తదితరులు పాల్గొన్నారు.


