కాకతీయ, హన్మకొండ: హనుమకొండ జి డబ్ల్యూ ఎం సి 8వ డివిజన్ పరిధిలోని సుభాష్ యూత్ గజాణన మండలి ఆధ్వర్యంలో 42వ సంవత్సరంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మహాలడ్డూ వేలంపాట ఈసారి రికార్డు స్థాయిలో జరిగింది.
గతంతో పోల్చితే ఎన్నడూ లేని విధంగా 51 కిలోల లడ్డూ రూ. 2,07,000 అక్షరాలా రెండు లక్షల ఏడు వేల రూపాయలకు) అమ్ముడైంది. ఈ లడ్డూను 8వ డివిజన్ కార్పొరేటర్ బైరి లక్ష్మికుమారి సాంబయ్య చిన్న కుమారుడు, హనుమకొండ బీజేపీ కార్యదర్శి బైరి శ్రవణ్ కుమార్.. లావణ్య దంపతుల తనయుడు బైరి సూర్యాన్ష్ గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో జంగా ప్రభాకర్, కిరణ్ గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.


