కాకతీయ, నెల్లికుదురు: నిత్యావసర సరుకుల మీద, ఆరోగ్యం, విద్యారంగం, వ్యవసాయ, ఆటోమొబైల్ రంగం, ఎలక్ట్రికల్ వస్తువుల మీద జిఎస్టి తగ్గించిన సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద బిజెపి మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ఎప్పుడూ పేద ప్రజల పక్షాన ఉంటూ అనేక సంక్షేమాలను ప్రవేశపెట్టి దేశ ప్రజలందరి మన్ననలు అందుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు రాస యాకిరెడ్డి, జాటోత్ యుగంధర్, ఎండి ముస్తఫా, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి పెరుమండ్ల శివసాయి గౌడ్, ఐలయ్య ప్రవీణ్ కుమార్, గ్రామ బూత్ అధ్యక్షులు గుగులోత్ సుధాకర్, జిలకర యాకన్న, తాళ్లపెళ్లి సాగర్, సురేష్, యాకన్న, శీను, శ్రీకాంత్ పాల్గొన్నారు.


