కాకతీయ ,డోర్నకల్ : మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం లోని పురుషోత్తయగూడెం ప్రధాన రహదారి వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిలో మంగళవారం గుర్తుతెలియని మహిళ హత్యగావించినట్లు తెలుసుకున్న ,మరిపెడ ఎస్సై సతీష్ దర్యాప్తు చేయగా హత్యా గావించి మృతి చెందిన మహిళ ఉల్లేపల్లి గ్రామానికి చెందిన బంటు వెంకటమ్మ (55) గుర్తించినట్లు తెలిపారు .
మృతురాలు వ్యవసాయ కూలీ మేస్త్రి గా ,పని చేసుకుంటూ ఉండేదని అన్నారు. కూలీల డబ్బుల కోసం వెళ్లి, తిరిగి వస్తానని సోమవారం రాత్రి ఇంటి నుండి భర్త లింగయ్య కు చెప్పి బయటకు వెళ్లి మంగళవారం ఉదయం నిర్జీవ ప్రదేశంలో విగత శవంగా మారిందని ,మహిళను హత్య చేసిన వారిని, ప్రాధమిక ఆదారాలతో గుర్తించినట్లు తెలిపారు మరిన్ని విషయాలు దర్యాప్తులో తెలియవలసి ఉందని ,నిందితులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.


