కాకతీయ, ములుగు: ములుగు జిల్లాలో వాజేడు, వెంకటాపురం (నూ) లోని జగన్నాధపురం, పేరూరు, వాజేడు, ఆలుబాకా, పాత్ర పురం, మోర్రివానిగూడెం మీసేవ కేంద్రాలను ఈ – డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ ఆకస్మిక తనిఖీ చేశారు. మీసేవ కేంద్రాలను ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉండి యుఎస్ డి గైడ్లైన్స్ ప్రకారం మీ సేవ కేంద్రాన్ని నడపాలన్నారు. ఆపరేటర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అన్ని రకాల మీసేవ, భూభారతి, మిగతా ఆన్లైన్ సర్వీస్ లను ప్రజలకు అందించాలని సూచించారు.
మీసేవ సెంటర్లో తప్పకుండా సిటిజెన్ చాప్టర్, భూభారతి కి సంబంధించిన ఫ్లెక్సీలు, మీసేవ లోగో, తాహాసిల్దార్, ఈడీఎం, పరిష్కారం కాల్ సెంటర్ల ఫోన్ నెంబర్లు తప్పనిసరిగా ఉండవలెనని ఆదేశించారు. వాజేడు, వెంకటాపురం మండల ప్రజలు ఆధార్ సేవల గురించి ఇబ్బందులు పడుతున్న విషయం గుర్తించి అదనపు కొత్త ఆధార్ సెంటర్ ని మండల కేంద్రంలలో అతి త్వరలో ఏర్పాటు చేస్తామని, కళ్యాణ లక్ష్మి భర్త, డెత్ సర్టిఫికెట్లు ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని మీసేవ ఆపరేటర్లు ప్రజల పట్ల సున్నితంగా ఉంటూ వారికి మీసేవ సర్వీసులను , ఇతర అన్ని రకాల ఆన్లైన్ సేవలను అందించాలని ఆదేశించారు.
నిర్ణీత రుసుము కంటే ఎక్కువ రుసుము దరఖాస్తుదారుడు నుంచి తీసుకున్నట్లయితే తప్పనిసరిగా అట్టి మీసేవ సెంటర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీసేవ జిల్లా మేనేజర్ పోలోజు విజయ్, మీసేవ సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.


