కాకతీయ, గీసుకొండ: ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన అవమానకర వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు శనివారం మండలంలోని మచ్చాపురం గ్రామ సెంటర్‌లో బీజేపీ మండల అధ్యక్షులు చొక్కం శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాహుల్ గాంధీ సంస్కారం ఎంత దిగజారిందో ఈ వ్యాఖ్యలతో తేలిపోయిందని విమర్శించారు. ప్రజల గౌరవానికి పాత్రులైన మాతృమూర్తిపై వ్యాఖ్యలు చేయడం రాజకీయ దౌర్భాగ్యమని ఖండించారు.పంచభూతాలకు మలినం అంటదని మోదీపై ఎన్ని అవమానాలు చేసినా ఆయన మరింతగా ఎదుగుతారు. ప్రజల హృదయాలను మరింతగా గెలుచుకుంటారు అని మండల అధ్యక్షుడు చొక్కాం శ్రీనివాస్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తుమ్మనపల్లి శంకర్రావు, పరకాల అసెంబ్లీ కన్వీనర్ ముల్క ప్రసాద్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు జాన్ విక్రమ్, మాజీ వైస్ ఎంపీపీ కామణి భాస్కర్,కోశాధికారి తిరుపతి రెడ్డి,మండల స్థానిక సంస్థల ఇన్చార్జ్ గడ్డమీది బాలరాజు, గట్ల బిక్షపతి, ఆకుల వెంకన్న, రమేష్ నాయక్,సింగిరెడ్డి అనిల్, కంబాల రాజు, గట్టిగా నాగరాజు,లడే శ్రీధర్, తిప్పారపు ప్రశాంత్, తిప్పారపు అజయ్, తుమ్మనపల్లి రాజు, లడే విగ్నేష్,పేరువాల వినయ్ తదితరులు పాల్గొన్నారు.


