కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో యూరియా కొరతపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ వినూత్న నిరసనలకు దిగింది. సచివాలం ముందు బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. గణపతి బప్పా మోరియా..ఇంకా కావాలి యూరియా అంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అటు తెలంగాణలోని అగ్రికల్చర్ కమిషనరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయాలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. కేటీఆర్, హరీశ్ రావు సహాబీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ ఆరోపణలు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.


