epaper
Friday, January 30, 2026
epaper

క్యూలైన్లలో భ‌క్తుల‌ కష్టాలు..

క్యూలైన్లలో భ‌క్తుల‌ కష్టాలు..
దర్శనానికి గంటల తరబడి నిరీక్షణ
తాగునీరు, నీడ లేక ఇబ్బందులు
అందిన కాడికి దండుకుంటున్న ప్రైవేటు వాట‌ర్ వ్యాపారులు

కాకతీయ, మేడారం బృందం : మేడారం మహాజాతర సందర్భంగా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించినప్పటికీ, భక్తులు మాత్రం క్యూలైన్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులు, పార్కింగ్‌లు, క్యూ లైన్లు, ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేసినా… ప్రత్యక్షంగా భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల విషయంలో లోపాలున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమ్మవార్ల దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు పొడవైన క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అయితే దర్శనం కోసం గంటల తరబడి నిల్చోవాల్సి రావడంతో భక్తులు అలసటకు గురవుతున్నారు. మధ్యలో విశ్రాంతి తీసుకునే అవకాశం లేకపోవడం వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భక్తులు వాపోతున్నారు.

తాగునీటి సదుపాయం కొరవడి

క్యూ లైన్లలో తాగునీటి సదుపాయం సరిపడా లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. ఉచితంగా తాగునీరు అందించాల్సిన చోట చాలా ప్రాంతాల్లో నీటి ట్యాంకులు, సరఫరా పాయింట్లు కనిపించడంలేదని భక్తులు చెబుతున్నారు. ఎండలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడంతో నీటి అవసరం ఎక్కువగా ఉండగా, అందుకు తగిన ఏర్పాట్లు లేకపోవడం ఆవేదన కలిగిస్తోంది. మరోవైపు క్యూ లైన్ల పరిసర ప్రాంతాల్లో తాగునీరు, కూల్‌డ్రింక్స్ విక్రయాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉచిత సదుపాయాలు లేకపోవడంతో భక్తులు తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ధరలకు బాటిల్డ్ వాటర్, శీతల పానీయాలు కొనుగోలు చేయాల్సి వస్తోందని అంటున్నారు. మహాజాతరలో సేవ కంటే వ్యాపారానికే ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అభివృద్ధి పనులు చేశామని చెప్పడమే సరిపోదని, క్యూ లైన్లలో నిల్చునే భక్తులకు తాగునీరు, నీడ, విశ్రాంతి, వైద్య సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని భక్తులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు, సేవా సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. మహాజాతర స్థాయికి తగిన విధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే భక్తులకు నిజమైన సౌకర్యం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మేడారం జాతరలో మగబిడ్డ జననం

మేడారం జాతరలో మగబిడ్డ జననం తల్లీ–బిడ్డాక్షేమం.. జాత‌ర‌లో పుట్ట‌డంతో కుటుంబ స‌భ్యుల్లో ఆనందం కాకతీయ,...

గ‌ద్దెకు చేరిన స‌మ్మ‌క్క త‌ల్లీ..!

గ‌ద్దెకు చేరిన స‌మ్మ‌క్క త‌ల్లీ..! కాక‌తీయ‌, మేడారం బృందం : మేడారం మహాజాతరలో...

స‌మ్మ‌క్క త‌ల్లీ ఆగ‌మ‌నం..!

స‌మ్మ‌క్క త‌ల్లీ ఆగ‌మ‌నం..! చిలుక‌ల గుట్ట నుంచి మేడారం వైపు అమ్మ‌ ఉద్విగ్న క్ష‌ణాల‌ను...

మేడారంలో న‌లుగురి మృతి

మేడారంలో న‌లుగురి మృతి ఆరుగురికి తీవ్ర గాయాలు కాక‌తీయ‌, మేడారం బృందం : మేడారం...

లాంఛనాల మధ్య గద్దెపైకి సమ్మక్క

లాంఛనాల మధ్య గద్దెపైకి సమ్మక్క అగ్రం ప‌హాడ్‌కు లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం గాల్లోకి కాల్పులు...

వనం నుంచి జనంలోకి సమ్మక్క.. మేడారంలో కీలక ఘట్టం

వనం నుంచి జనంలోకి సమ్మక్క.. మేడారంలో కీలక ఘట్టం కాకతీయ, మేడారం బృందం...

మ‌ద్ది మేడారంలో గ‌ద్దెల‌పైకి వ‌న‌దేవ‌త‌లు

మ‌ద్ది మేడారంలో గ‌ద్దెల‌పైకి వ‌న‌దేవ‌త‌లు కాకతీయ, నల్లబెల్లి : వేలాదిగా తరలివచ్చిన భక్త...

పండగ పూట ఎందుకొచ్చినట్టు?!

పండగ పూట ఎందుకొచ్చినట్టు?! ఏనుమాముల మార్కెట్‌కు స్టేట్‌ విజిలెన్స్ టీమ్ జాతర వేళ విచారణ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...
spot_img

Popular Categories

spot_imgspot_img