epaper
Thursday, January 29, 2026
epaper

పొత్తుతోనే పోటీ

పొత్తుతోనే పోటీ
ఎదులాపురంలో మున్సి‘పాలిటిక్స్’
32వార్డుల్లో కేవ‌లం 25 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన మంత్రి
మిగిలిన ఏడింటి నుంచి సీపీఐ అభ్య‌ర్థుల‌కు ఛాన్స్‌..!?
గ‌డువు స‌మీపిస్తున్నా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో ఉత్కంఠ‌
పొత్తు కుదిరిన‌ట్లేనంటూ కాంగ్రెస్ నేత‌ల వ్యాఖ్య‌లు
బీఆర్ఎస్–సీపీఎంల మ‌ధ్య పొత్తు పొడించిన వేళ ఆస‌క్తిక‌ర ప‌రిణామం

కాకతీయ, కూసుమంచి : మున్సిపాలిటీ ఎన్నికలకు నగారా మోగడంతో ఎదులాపురం మున్సిపాలిటీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని ఎదులాపురం మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 25 వార్డులకు అభ్యర్థులను ప్రకటించడంతో పొత్తుల రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. మొత్తం 32 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో మిగిలిన ఏడు వార్డులపై స్పష్టత లేకపోవడంతో—అవి పొత్తులో భాగస్వామి సీపీఐకే కేటాయించబోతున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

25 వార్డుల వెనుక వ్యూహమేంటి?
కాంగ్రెస్ పార్టీ 25 వార్డుల జాబితాను విడుదల చేయగానే, ఇప్పటివరకు పొత్తులో ఉన్న సీపీఐ స్థానం ఏంటన్నది రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, మిగిలిన ఏడు సీట్లు సీపీఐ కోసం వదిలే అవకాశముందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే సీపీఐ మాత్రం ఏడు కాదు—పది నుంచి 12 వార్డులు కోరుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. సీట్ల పంపకాల్లో ఇంకా తుది నిర్ణయం రాకపోవడంతోనే కాంగ్రెస్ పార్టీ మిగిలిన అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేసిందన్న వాదన బలపడుతోంది. సీపీఐ కోరుతున్న మేరకు సీట్లు దక్కకపోతేకాంగ్రెస్‌తో పొత్తు కొనసాగింపుపై ఆ పార్టీ వెనుకడుగు వేసే అవకాశాలు లేకపోలేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితిలో సీపీఐ ఒంటరిగా బరిలో దిగితే నష్టం కాంగ్రెస్‌కే ఎక్కువగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా పట్టణ పరిధిలో ఓటు చీలిక జరిగితే అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగలవచ్చన్న ఆందోళన కనిపిస్తోంది.

బీఆర్ఎస్–సీపీఎం ఇప్పటికే పొత్తు..
ఇదిలా ఉండగా, ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి ఇప్పటికే సీపీఎంతో పొత్తు ఖరారు చేసుకుని దూకుడుగా ముందుకెళ్తోంది. గత పంచాయతీ ఎన్నికల్లో రూరల్ ప్రాంతాల్లో బీఆర్ఎస్–సీపీఎం కూటమి అధికార పార్టీకి షాక్ ఇచ్చిన అనుభవం ఉంది. అదే సమీకరణ ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ప్రభావం చూపుతుందన్న భయం కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎదులాపురం మున్సిపాలిటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ లెక్కలు కట్టుకుంటూ ముందుకు సాగుతున్నారన్నది అంతర్గత సమాచారం. అందుకే పొత్తుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి—కాంగ్రెస్–సీపీఐ పొత్తు కొనసాగుతుందా? లేక సీట్ల పంచకం కాంగ్రెస్‌కు కొత్త సవాళ్లు తెచ్చిపెడుతుందా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ఎదులాపురం మున్సిపాలిటీ ఫలితం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం కావడం ఖాయం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జోరుగా నామినేషన్లు

జోరుగా నామినేషన్లు ఐదు మున్సిపాలిటీల్లో రెండో రోజే 309 దాఖలు బీఆర్‌ఎస్–కాంగ్రెస్ మధ్య పోటాపోటీ కాకతీయ,...

మంత్రి పొంగులేటిని కలిసిన ఇమ్మడి..

మంత్రి పొంగులేటిని కలిసిన ఇమ్మడి..  కాకతీయ,కారేపల్లి: రాష్ట రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్...

బీసీ నాయకులపై అక్రమ కేసులు సిగ్గుచేటు

బీసీ నాయకులపై అక్రమ కేసులు సిగ్గుచేటు మణుగూరు సీఐ తీరు మార్చుకోవాలి మండిపడ్డ...

పేదలపైనే ప్రతాప‌మా ?

పేదలపైనే ప్రతాప‌మా ? ఖ‌మ్మంలో ఇండ్ల కూల్చివేతతో ఉద్రిక్త‌త‌ పాలకుల తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు మంత్రి...

బాలుడి మృతికి కారణమైన ఇద్దరికి ఏడేళ్లు జైలు

బాలుడి మృతికి కారణమైన ఇద్దరికి ఏడేళ్లు జైలు మొదటి అదనపు జిల్లా న్యాయ‌మూర్తి...

మున్సిప‌ల్స్‌లో సత్తా చాటాలి

మున్సిప‌ల్స్‌లో సత్తా చాటాలి ఖ‌మ్మం డీసీసీ అధ్య‌క్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ జిల్లా పార్టీ...

వనం నుంచి జనంలోకి ..

వనం నుంచి జనంలోకి .. గ‌ద్దెల‌పైకి సారలమ్మ ఘనంగా గరీబ్ పేట జాతర అధిక సంఖ్యలో...

బోధనలో మార్పు రావాలి

బోధనలో మార్పు రావాలి డీఈవో చైతన్య జైని కాకతీయ, ఖమ్మం : బోధ‌న‌లో మార్పు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...
spot_img

Popular Categories

spot_imgspot_img