నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన స్టేట్ ఎలక్షన్ అబ్జర్వర్
కాకతీయ, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ నామినేషన్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు జితేందర్ రెడ్డి, ఎన్నికల వ్యయ పరిశీలకులు మనోహర్ గురువారం సందర్శించారు. నామినేషన్ల స్వీకరణ విధానం, భద్రత ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఎన్నికల నిబంధనలు పగడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. వారితోపాటు మున్సిపల్ కమిషనర్ ఆయాజ్, టీపీఓ శ్రీధర్, అధికారులు పాల్గొన్నారు.


