epaper
Thursday, January 29, 2026
epaper

మేడారంలో నిషేధిత అలాలు

మేడారంలో నిషేధిత అలాలు
పవిత్రతకు భంగం….నిషేధానికి తూట్లు
సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యాపారుల‌ ప్రవర్తన
ఆదివాసీ సంస్కృతి పరిరక్షణపై డిమాండ్
భక్తుల్లో ఆగ్రహం–ఆందోళన

కాకతీయ, మేడారం బృందం : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా ఖ్యాతి గడించిన సమ్మక్క–సారక్క మేడారం మహాజాతరలో పవిత్రతకు భంగం కలిగించే ఘటనలు భక్తులను కలవరపెడుతున్నాయి. జాతర ప్రాంగణంలో మద్యం సేవనాన్ని అధికారులు కఠినంగా నిషేధించినప్పటికీ, కొందరు ఆ ఆంక్షలను లెక్కచేయకుండా అలాలు చేస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పవిత్రమైన వనదేవతల క్షేత్రంలో ఇలాంటి ప్రవర్తన అనుచితమని భక్తులు మండిపడుతున్నారు. జాతర అనగానే భక్తి, విశ్వాసం, సంప్రదాయం ప్రధానంగా ఉండాల్సిన చోట, కొందరి బాధ్యతారాహిత్యం మేడారం ఆత్మను దెబ్బతీస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కుటుంబాలతో, మహిళలతో వచ్చే భక్తులకు ఈ పరిణామాలు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొంద‌రి తప్పుదారి..!

మేడారం జాతరలో ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం అమ్మవార్లకు మొక్కులుగా కోడి, మేక, గొర్రెలను సమర్పించడం ఆనవాయితీ. ఇవన్నీ విశ్వాసంతో కూడిన ఆచారాలుగా తరతరాలుగా కొనసాగుతున్నాయి. అయితే ఈ పవిత్ర సందర్భంలో మద్యం సేవించడం సంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధమని భక్తులు స్పష్టం చేస్తున్నారు. అలాలు చేయడం వల్ల శాంతిభద్రతలకు భంగం కలిగే ప్రమాదం ఉందని, జాతర వాతావరణం అపవిత్రమవుతోందని వారు ఆందోళన చెందుతున్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. జాతర ప్రాంగణంలో నిరంతర పోలీస్ గస్తీ, మద్యం విక్రయాలపై కఠిన నిఘా, అలాలు చేస్తున్న వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు. మేడారం మహాజాతర ఒక ఉత్సవం మాత్రమే కాదు.. అది ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలకు ప్రతీక. ఇలాంటి పవిత్ర జాతరలో అనుచిత ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు, భక్తులు, స్థానికులు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నారు. పవిత్రతను కాపాడితేనే మేడారం మహాజాతర అసలైన ఆత్మ నిలుస్తుందన్నది భక్తుల ఆకాంక్ష.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

‘డ్రగ్స్‌తో జీవితం మసి… మానేస్తే జీవితం ఖుషి’

‘డ్రగ్స్‌తో జీవితం మసి… మానేస్తే జీవితం ఖుషి’ మేడారం జాతరలో వినూత్నంగా ప్రభుత్వ...

మేడారంలో గుప్పుమంటున్న గుడుంబా

మేడారంలో గుప్పుమంటున్న గుడుంబా ర‌ద్దీ ప్ర‌దేశాల్లో జోరుగా నిషేధిత సారా విక్ర‌యాలు భక్తుల రాకపోకల...

పకడ్బందీగా మేడారం

పకడ్బందీగా మేడారం ప్రభుత్వం కంటిన్యూగా మానిటరింగ్! భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు జంపన్నవాగు వద్ద స్వయంగా...

నేతల ప్రచార జాతర!

నేతల ప్రచార జాతర! అమ్మవారిపేటలో నిబంధనలకు విరుద్ధంగా ప్లెక్సీలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ప్రజల్లో...

మేడారంలో పారిశుధ్య అవస్థలు

మేడారంలో పారిశుధ్య అవస్థలు మరుగుదొడ్లలో నీళ్లు నిలిచి భక్తులకు ఇబ్బందులు ట్యాంకర్లతో వెంటనే సరఫరా...

మేడారంలో బాంబు స్క్వాడ్ త‌నిఖీలు

మేడారంలో బాంబు స్క్వాడ్ త‌నిఖీలు చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత కాకతీయ, మేడారం బృందం...

జంపన్న వాగులో నీట మునిగిన వ్య‌క్తి

జంపన్న వాగులో నీట మునిగిన వ్య‌క్తి కాపాడిన భ‌ద్రతా సిబ్బంది.. పరిస్థితి విషమం మేడారం...

అడవి పులకించె…సార‌ల‌మ్మ‌ గద్దెపై కొలువుదీరె!

అడవి పులకించె…సార‌ల‌మ్మ‌ గద్దెపై కొలువుదీరె! కన్నెపల్లి నుంచి సారలమ్మ రాకతో తొలి ఘట్టం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...
spot_img

Popular Categories

spot_imgspot_img