అమ్మవారిపేట జాతరలో అగ్ని ప్రమాదం
సారలమ్మను తీసుకొచ్చే సమయంలో ఘటన
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ నగరం బట్టుపల్లి అమ్మవారిపేట దామెర గుట్టల్లో శ్రీ సమ్మక్క, సారలమ్మ జాతరలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. సారలమ్మను తీసుకొచ్చే క్రమంలో టపాసులు కాల్చడతో పక్కనే ఉన్న గుట్టలో తారజువ్వలు పడి ప్రమాదం జరిగింది. ఆ సమయంలో పక్కనే ఉన్న ఫైర్ సిబ్బంది ఎ.రవీందర్, సిహెచ్ వినోద్ చాకచక్యంగా మంటలను అదుపు చేశారు. ఫైర్ సిబ్బందిని మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ రమేష్ అభినందించారు.


