కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఓట్లు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ దేశ భద్రతను పణంగా పెట్టడం సరైన పద్దతి కాదని ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. ఇలాంటి చవకబారు ఆరోపణలు సరికాదంటూ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ అని సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసిందన్నారు. దాని ప్రకారం నిర్ణయాలు ఉంటాయి కానీ..దానికి పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉంటుంది..ఆ మాత్రం అవగాహన లేకుండా ఉంటే ఎలా అంటూ ప్రశ్నించారు. ఈరోజు కరీంనగర్ లో పర్యటించిన ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఓటు చోరీ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై ఎంపీ ఈటెల స్పందించారు.
ఇక కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే గెలిచిందన..ఇక్కడ కూడా ఈవీఎంలతో ఎన్నికలు జరిగాయి కదా అంటూ ప్రశ్నించారు. మీరు గెలిస్తే మెషిన్లు, ఈసీగా మంచిగా పనిచేసినట్లు, ఓడిపోతే ఎలక్షన్ కమిషన్ పనిచేయనట్లు ఓట్ల చోరీ జరిగినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన అంటూ మండిపడ్డారు.
హైదరాబాద్ లో అద్దెకు ఉండేవాళ్లు ఒక ప్రాంతం నుంచి మరోక ప్రాంతానికి మారుతుంటారు. వీరి ఓట్లను సరిచేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీదే ఉంటుంద కదాని ప్రశ్నించారు. ఓట్ల నమోదు, డబుల్ ఓట్లను తొలగించే విధానం నిరంతర ప్రక్రియ అని అన్నారు. బీహార్ బార్డర్ ఉన్న ప్రాంతమని ఇక్కడికి బంగ్లాదేశ్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఛాన్స్ ఉందన్నారు. అలా వచ్చిన వారందరికీ ఆధార్ కార్డులు సిటిజన్ షిప్ ఇవ్వడం ఎంత వరకు దేశానికి మంచిదని ప్రశ్నించారు.


