కాకతీయ, సినిమా డెస్క్: చిత్రపరిశ్రమలో ఎవరి కుంపటి వారమిదేనంటూ హాట్ కామెంట్స్ చేశారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. సైమా ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడారు. ఎవరికైనా నేషనల్ అవార్డు వచ్చినట్లయితే పండగలా జరుపుకోవాలి. కానీ చిత్రపరిశ్రమలో అలాంటి వాతావరణమే లేదన్నారు. తెలుగు సినిమాకు 7 జాతీయ అవార్డులు వచ్చినా ఇండస్ట్రీ స్పందించకుముందే సైమా వాళ్లు స్పందించి వారందరినీ స్టేజ్ పైకి తీసుకువచ్చి సత్కరించుకోవాలనుకోవడం చాలా ప్రశంసనీయ విషయమన్నారు.
విజేతలందరికీ నా హ్రుదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నారు. తెలుగు సినిమాకు నేషనల్ అవార్డులు వచ్చిన సందర్భాన్ని మనమంతా పండగలా జరుపుకోవాలి. ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తునందుకు సైమా వారికి నిజంగా ధన్యవాదాలు చెబుతున్నాను అని అరవింద్ అన్నారు.
గతంలో థియేటర్ల బంద్ సందర్భంగా తెలుగు ఇండస్ట్రీలో వివాదం నెలకొన్న సందర్భంలో ఆ నలుగురులో నేను లేనంటూ అల్లు అరవింద్ చెప్పిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో 1500 థియేటర్స్ ఉంటే అందులో 15లోపే నా ఆధీనంలో ఉన్నాయని..నన్ను ఆ నలుగురిలో కలపకండని..తెలంగాణలో నా దగ్గర ఒక థియేటర్ కూడా లేదంటూ అరవింద్ చెప్పుకొచ్చారు.


