సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే
సాధు మాలాద్రి
కాకతీయ, ఖమ్మం : ఖానాపురం హవేలీ లిక్కి కృష్ణారావు అధ్యక్షతన పూలే అంబేడ్కర్ అధ్యయన వేదికలో మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి వేడుకలు బహుజన మహాసభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సాధు మాలాద్రి హాజరై మాట్లాడారు. పూలే సత్యశోధక్ సమాజాన్ని ఏర్పాటు చేసి నిజాన్ని నిబ్బరంగా చెప్పేవాడని అన్నారు. బ్రాహ్మణీయ వాదము నుంచి సూద్రా కులాలు విముక్తి కావాలని పోరాడాడని అన్నారు. అంతటి మహనీయుడు చూపించిన మార్గం ద్వారా నేడు తెలంగాణ ప్రాంతంలో బీసీల రిజర్వేషన్ కోసం ఉద్యమించాలని అన్నారు సుంకర శీను మాట్లాడుతూ పూలే ఆశయాన్ని కొనసాగించడం అంటే నేడు బీసీలు రిజర్వేషన్ సాధించుకోవడంతోపాటు బహుజన రాజ్యాధికారం సాధించడమే ఆశయంగా ఉండాలని అన్నారు . బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె పర్వతాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బహుజన కుల సంఘాలను ఏర్పాటు చేసి రాజ్యంపై తిరుగుబాటుడంకా మోగించిన కామ్రేడ్ మారోజు వీరన్న ఆలోచనతో ఈ రాష్ట్రంలో కుల సంఘాల నిర్మాణం జరిగి మా శక్తిగా ఎదగాలని సూచించారు .బీఎప్టీయూ రాష్ట్ర కార్యదర్శి గాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రాహ్మణీయ వాదాన్ని ఆధిపత్య కులాలను వారు ఏర్పాటు చేసుకున్నా రాజకీయ పార్టీలను తక్షణమే బీసీలు వాటి నుంచి బయటపడాలని సూచించారు . పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పొడకండి రాంబాబు మాట్లాడుతూ నవంబర్ 30న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సదస్సును జయప్రదం చేయాల్సిన బాధ్యత దళిత బహుజన జాతులపై ఉందని అన్నారు . ఈ కార్యక్రమంలో సామాజిక నాయకులు మేకల సుగుణ , బహుజన టీచర్స్ యూనియన్ లీడర్ నాగమణి , సంపత్ , లింగనబోయిన లక్ష్మణ్ , పి ఆర్ దేవి , పెరుగు రమణ , ముత్యాలరావు , నరేష్ , దార వెంకయ్య , బసవయ్య , తదిరులు పాల్గొన్నారు .


