కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే సత్యం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం, ఆదివారం మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం దేవస్థానానికి విచ్చేసిన ఆయనను ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మేడిపల్లి సత్యం.జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి నమ్మకం ఉంచిన పార్టీ హైకమాండ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తానని, కార్యకర్తలకు అండగా నిలుస్తానని స్పష్టంచేశారు. ప్రజాసేవే తన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దొంగ ఆనంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస మల్లేశ్వరి, దారం ఆది రెడ్డి, వెలుమా లక్ష్మారెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు శనిగారపు తిరుపతి, ముత్యం శంకర్, ముత్యాల రామలింగరెడ్డి, మేక లక్ష్మణ్, కంచర్ల లక్ష్మణాచారి, అల్లూరి రాజేశ్వర్ రెడ్డి, సతీష్ రెడ్డి, వీరభతిని ప్రతాప్, ఆగంతపు వంశీ, సంత ప్రకాష్ రెడ్డి, నరసింహారెడ్డి, తిరుపతిరెడ్డి, మారంపల్లి గంగాధర్, శ్రీకాంత్, బండి రవి, నులుగొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు.


