అందరి వాడు సహజ కవి అందెశ్రీ
న్యూరో సర్జన్ డాక్టర్ జగదీష్
కాకతీయ, ఖమ్మం: అందరివాడు మన సహజ కవి అందే శ్రీ స్పూర్తి తో ప్రజలలో మమేక మై తెలంగాణ అస్తిత్వం, గౌరవాన్ని నిలుపుతూ మనం ముందుకు కదలాలని ప్రముఖ న్యూరో సర్జన్ , డాక్టర్ జగదీష్ పిలుపునిచ్చారు. లంబాడీ హక్కుల పోరాట సమితి ( ఎల్ హెచ్ పీ ఎస్ ) , వీర నారీమణుల ఆశయ సాధన సమితి, తెలంగాణ బహుజన జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం ఎల్ హెచ్ పీ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ బద్రూ నాయక్ అధ్యక్షతన బీ కే బజార్ లో జరిగిన ప్రజా కవి, సహజ కవి అందెశ్రీ సంస్మరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మంచి మనసు, మంచి మానవ సంబంధాలు సమాజంలో మనకు మంచి పేరును తీసుకొస్తా యన్నారు. మన కవి అందెశ్రీ అలాంటి వాడేనని, అందుకే ఆయన అందరి వాడు అయ్యారని తెలిపారు. లంబాడీ హక్కుల పోరాట సమితి ( ఎల్ హెచ్ పీ ఎస్ )రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ బద్రూ నాయక్ మాటాడుతూ పేదరికం లో పుట్టి , పేదరికం లోనే పెరిగి, ఆ పేదరికం లోనే చివరి శ్వాస తీసుకుంటూ …. ప్రతిక్షణం తెలంగాణ గానం , తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాటం చేసిన ప్రజా కవి, సహజ కవి అందెశ్రీ అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆయన గేయం సకల జనులకు ఏకం చేసిందని తెలిపారు. పామరుడు అయినా పండితుడు వలె గేయ రచనలతో పాటు తానే సొంతంగా గానం చేసిన అందెశ్రీ తెలంగాణ ఉద్యమకారులకు మాత్రమే కాకుండా సకల జనులకు ఆదర్శనీయుడని పేర్కొన్నారు. తొలుత అందెశ్రీ చిత్రపటం తో పాటు గద్దర్, బెల్లీ లలిత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిబాపూలే, ఫాతిమా షేక్ , సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు కూడా పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్ర బాయి , అడ్వకేట్ ఎస్.కె . నజీమా, వివిధ సంఘాల నాయకులు పగిడిపల్లి నాగేశ్వరరావు , నకరికంటి సంజీవరావు , హనుమంతరావు , రిటైర్డ్ సీఐ నాగయ్య , రవీంద్ర నాయక్ , మురళి నాయక్ , వీరన్న మహిళ నాయకురాలు భూక్య జ్యోతి , ప్రమీల, ఝాన్సీ, కవిత, పి. లక్ష్మి, సుధా, మరియా, కోమలి, సుజాత, సునీత, నాగమణి, రాధిక తదితరులు పాల్గొనగా పమ్మి రవి , పాగె వెంకన్న , కొమ్ము రమా , జాంబవ గర్జన లు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.


