మహిళలను కోటీశ్వరులుగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
పరకాల మహిళా డైరీ మహిళల భవిష్యత్ నిర్మాణానికి పునాదిగా నిలవాలి
ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాకతీయ, పరకాల: ఆదివారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల, నడికూడ, ఆత్మకూర్,దామెర, మండలాల పరిధిలోని మహిళలకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి. ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని,ఆడబిడ్డలకు సారే పంపిణీ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను గౌరవిస్తున్నారని అన్నారు.మహిళా సాధికారికత నిర్ణయం తీసుకునే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వమని అన్నారు. మహిళా శక్తిని గౌరవించబడడమే ప్రధానమనమని ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు కల్పించిదని తెలిపారు.పొదుపు ఆలోచన ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితులను మార్పు తీసుకువచ్చే వ్యవస్థ మహిళా సంఘాల గ్రూపు వల్ల కలిగిందని ఎవరి సహాయం లేకుండా మహిళలు వారికి వారే ఎదగాలనే ఉద్దేశంతో మహిళా గ్రూపులకు ఏర్పాటు చేశామని వీటి ఆధారంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచుకొని రాష్ట్ర, దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు కల్పించే మహిళలు గా ఎదగాలని ఆకాంక్షించారు. మహిళా శక్తి మండల సమాఖ్య నాయకత్వంలో సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేయడం వల్ల ఆర్థికంగా బలపడతారని తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని,2047 విజన్ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.మహిళా శక్తి ఉప్పెనలా ముందుకు సాగాలని, ఎన్ని అడ్డంకులు వచ్చిన లక్ష్యం వైపు అడుగులు వేయాలని కోరారు. పరకాల మహిళా డైరీ ఏర్పాటు మహిళలపై పూర్తి నమ్మకంతో ఏర్పాటు చేస్తున్నామని ఇది అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి, బుర్ర దేవేందర్ గౌడ్, కొయ్యడ శ్రీనివాస్, మహిళా సమాఖ్య అధికారులు, సభ్యులు, రెవిన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


