ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్‌కు తృటిలో ప్రమాదం
కాకతీయ, కరీంనగర్ : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు దగ్గర ఆదివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. కొండగట్టు అంజన్న స్వామి దర్శించుకోడానికి వెళ్తున్న చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్‌లోని ఒక కారు ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టింది.దీంతో వెనుక వరుసగా వచ్చిన మరికొన్ని కార్లు కూడా ఒక్కదాని తరువాత ఒకటి ఢీకొన్నాయి. ఎయిర్‌బ్యాగ్లు తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనలో ఎమ్మెల్యే సహా ఎవరికి గాయాలు కాలేదు. అయితే కాన్వాయ్‌లోని మూడు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి.



