విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి
టీపీసీసీ మాజీ సెక్రెటరీ బిల్లా సుధీర్ రెడ్డి
కాకతీయ,రాయపర్తి : విద్యార్థులు శారీరక,మానసికంగా దృఢంగా ఉండాలంటే విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని టీపీసీసీ మాజీ సెక్రెటరీ బిల్లా సుధీర్ రెడ్డి అన్నారు.మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బిల్లా శివాని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం కబడ్డీ క్రీడాకారులకు ఆయన టీ షర్ట్స్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలంటే తమకు ఎంతో మక్కువ అని, పాఠశాల అభివృద్ధికి స్వాయ శక్తుల కృషి చేస్తానని సుధీర్ రెడ్డి తెలిపారు.విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని,క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా ముఖ్యమన్నారు.స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని విద్యార్థులకు సూచించారు.సరైన ప్రణాళిక ఏర్పాటు చేసుకొని కష్టపడి చదివి పాఠశాలకు,తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరారు.కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ రెడ్డి,పీడి కొమ్ము శ్రీనివాస్,ఆకుల సురేందర్,గారె బిక్షపతి,కళ్యాణ్ గౌడ్,అప్రోజ్ తదితరులు పాల్గొన్నారు.


