స్పెషల్ లోక్ అదాలత్‌లో 1861 కేసులకు రాజీ
సైబర్ మోసాల్లో కోల్పోయిన రూ.20 లక్షలు బాధితులకు రీఫండ్
ఎస్పీ అశోక్‌కుమార్
కాకతీయ, జగిత్యాల : జిల్లాలో నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్‌లో భాగంగా మొత్తం 1861 కేసుల్లో ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరేలా చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఐపీఎస్ తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న, రాజీకి అనువుగా ఉన్న కేసులను ఈ లోక్ అదాలత్ ద్వారా వేగవంతంగా పరిష్కరించినట్లు చెప్పారు.అదే విధంగా, జిల్లాలో నమోదు అయిన 66 సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులు కోల్పోయిన రూ.20 లక్షల మొత్తాన్ని తిరిగి రీఫండ్ చేసే ప్రక్రియను పూర్తి చేసినట్లు వెల్లడించారు.సైబర్ సేఫ్టీ చర్యలు, బ్యాంకింగ్ కోఆర్డినేషన్, టెక్నికల్ అనాలిసిస్, వేగవంతమైన ‘ఫ్రీజింగ్’ చర్యలే ఈ రికవరీకి కారణమని ఎస్పీ పేర్కొన్నారు.స్పెషల్ లోక్ అదాలత్‌ను విజయవంతంగా నిర్వహించిన జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.


