నిఘా నేత్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
శోభన్ బాబును సన్మానించిన ఎమ్మెల్యే
కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని స్థానిక ఇనుగుర్తి గ్రామంలో భూక్య శోభన్ బాబు బహుకరించిన రెండు లక్షల 55 వేల విలువగల 20 సోలార్ నిఘానేత్రాలను శనివారం ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ప్రారంభించారు. స్థానిక రైతు వేదిక లో ఏర్పాటుచేసిన సమావేశంలో బహుకరించిన భూక్య శోభన్ బాబును ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇనుగుర్తి గ్రామం చరిత్ర గల గ్రామమని చట్ట వ్యతిరేక పనులు లా అండ్ ఆర్డర్ కు ఉపయోగకరంగా ఉండే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని ఇంతటి మహాకార్యానికి సహకరించిన శోభన్ బాబును అభినందిస్తూ మరిన్ని కార్యక్రమాలకు ముందుకు రావాలన్నారు. యువత మంచి మార్గంలో నడవాలని ఇనుగుర్తి గ్రామానికి మంచి పేరు తేవాలని చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని చర్యలు తీసుకోవాలని ఎస్సై కరుణాకర్ కి సూచించారు. అంతకు మునుపు బహూకరించిన దాత శోభన్ బాబు మాట్లాడుతూ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన నా జన్మ స్థలానికి నా వంతు సహాయంగా ఇలాంటికార్యక్రమాలు
ఎన్నో చేయడానికి సిద్ధంగా ఉన్నానని మునుముందు ఎమ్మెల్యే ఆదేశిస్తే మరిన్ని పనులు చేయడానికి ముందుకు సాగుతానని అన్నారు. ఎస్సై మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలకు మునుముందు అందరూ సహకరించాలని ఎలాంటి చట్ట వ్యతిరేక పనులు పాల్పడిన కఠిన శిక్షలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, ఎస్సై గంగారపు కరుణాకర్, జిల్లా, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



