పోగొట్టుకున్న 30 మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగింత
ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 2938 మొబైల్ ఫోన్లను రికవరీ
వివరాలు వెల్లడించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: పోగొట్టుకున్న 30 మొబైల్ ఫోన్లను (సి ఈ ఐ ఆర్) సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి బాధితులకు అప్పగించినట్లు అడిషనల్ డీసీపీ బి. రామానుజo తెలిపారు.
పోగొట్టుకున్న/చోరీకి గురైన మొబైల్ ఫోన్ల ను బాధితులు సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చెయ్యాలని లేకుంటే గుర్తు తెలియని వ్యక్తులు మీ ఫోన్ ద్వారా క్రైమ్ లో పాల్గొన్నట్లయితే ఫోను యజమాని కి ఇబ్బంది కలుగుతుందన్నారు.సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో మొబైల్ ఫోన్ ట్రాక్ చేసిన ఐటి సెల్ బృందం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచనలతో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం యజమానులకు అడిషనల్ డీసీపీ చేతుల మీదుగా అప్పగించారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ…

సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ విధానంతో సుమారు ఎనిమిది లక్షల విలువ గల 30 ఫోన్లను ట్రేస్ చేసి, నిజమైన యజమానులకు అప్పగించినట్లు తెలిపారు.ఒక్కొక్క మొబైల్ ఫోన్ యాబై వేల నుండి 10 వేల రూపాయలు ఖరీదు గల ఫోన్లను ట్రాక్ చేయడం జరిగిందన్నారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే మొబైల్ ఫోన్లు7998 పోగొట్టుకున్నట్లు సి ఈ ఐ ఆర్ పోర్టల్ ఫిర్యాదులు నమోదు కాగా 2938 ఫోన్ల ట్రాక్ ను గుర్తించి మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు.
ప్రస్తుత జీవన శైలిలో మొబైల్ ఫోన్ అత్యంత కీలక పరికరం అయ్యిందని, ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్న…నగదు లావాదేవీలు చేయాలన్న మొబైల్ ఫోన్ పైనే ఆదారపడేంతగా ప్రాదాన్యం సంతరించుకుందని అన్నారు. మొబైల్ ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకున్న /చోరికి గురైతే పరిస్తితి ఎలా ఉంటుందో ఊహించనవసరం కష్టమేనని అన్నారు. పోయిన ఫోన్ లను వెతికి పెట్టడానికి పోలీస్ యంత్రాంగం ఇప్పటికే పలు రకాల సాంకేతిక అంశాలను ఉపయోగిస్తుందన్నారు.సెల్ ఫోన్ల రికవరీ లో కీలకంగా వ్యవహరించిన ఐటి సెల్ ఇన్చార్జి హేమనాథ్ , టెక్నికల్ బృందాన్ని ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ అభినందించారు.



